బీఆర్‌ఎస్ నేతల తీరు దొంగే.. దొంగా అన్నట్లుంది
పోలీసులపై గులాబీ నేతల దౌర్జన్యంపై కిచ్చెన్న ఆగ్రహం మహేశ్వరం, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): ప్రజాస్వామ్యానికి వేదికైన అసెంబ్లీ వద్ద అలజడి సృష్టించేందుకు బీఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేశారని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, నల్లచొక్కాలు ధరించి సభకు వచ్చి తెలంగాణ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు. పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ నేతలు దురుసుగా, దౌర్జన్యంగా వ్యవహరించినప్పటికీ పోలీసులు సంయమనం పాటించారని అన్నారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని...