ఉద్యోగాల పేరుతో రూ.44 లక్షల మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
కరీంనగర్, సెప్టెంబర్ 8 (చైతన్యగళం): నకిలీ ఉద్యోగ నియామక పత్రాలతో నిరుద్యోగులను మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్లపల్లి గ్రామానికి చెందిన దుడపాక తిరుపతి అలియాస్ తిరుపతిరావు (51)ను మంగళవారం శాతవాహన యూనివర్సిటీ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు తనను శాతవాహన యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుని, డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర...