రైతులకు నాణ్యమైన సేవలు అందించాలి: ప్రణవ్‌

హుజురాబాద్‌, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): హుజురాబాద్‌ పట్టణంలోని డిపో క్రాస్‌ వద్ద అగ్రిమాల్‌ ఆగ్రో మాల్‌ ఫర్టిలైజర్‌ షాపును కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు అవసరమైన ఎరువులు, వ్యవసాయ సంబంధిత సేవలను అందుబాటులో ఉంచి నాణ్యమైన సేవలు అందించాలని షాపు యాజమాన్యాన్ని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుహాసిని, కౌన్సిలర్లు, పట్టణ సీఐ కరుణాకర్‌, పట్టణ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు, మహిళా నాయకులు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.