తుక్కుగూడ, కందుకూరులో ఫిజియోథెరపీ అవగాహన ర్యాలీ

ఆరోగ్య పరిరక్షణలో ఫిజియోథెరపీ కీలకం మహేశ్వరం, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మహబూబత్‌నగర్‌ గ్రామంలోని మాధవాంజీ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో తుక్కుగూడ, కందుకూరు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఫిజియోథెరపీ ప్రాధాన్యత, వ్యాయామం, శారీరక దృఢత్వం, పునరావాస చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గాయాలు, శారీరక వైకల్యాలు, వివిధ అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడంలో ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని...