CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 9:48 am Posted by : rakeshkashaveni12@gmail.com

ఖర్గేకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండించిన ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి సెప్టెంబర్ 8( చైతన్యగళం):

ఎస్సీ, ఎస్టీల గౌరవం, హక్కుల పరిరక్షణకు పోరాటం కాంగ్రెస్ ఎంపీలున్యూఢిల్లీ ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించిన ప్రాంతంలో శుద్ధికరణపేరుతో జరిగిన ఘటనను కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉందని కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం అక్బర్ రోడ్‌లోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం తొలి సమావేశం జరిగింది. సమావేశానికి తెలంగాణ నుంచి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి, ఎంపీ బలరాం నాయక్హాజరయ్యారు.సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఉత్తరాఖండ్ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఎంపీలను పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. స్టేషన్ వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.ఖర్గే పర్యటించిన ప్రాంతంలో “శుద్ధికరణ”కు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఖర్గేకు జరిగిన అవమానానికి నిరసనగా ఈ నెల 12న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ప్రకటించింది.