మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ప్రజలకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపు కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలు మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన “మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ బుధవారం సాయంత్రం తన...