చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

ఉద్యోగుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం: జేఏసీ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్‌ అధికారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో లోపాలను సరిదిద్దాలని,...