బీసీ గురుకులానికి ఎల్‌ఈడీ లైట్లు అందజేత

కొత్తగొల్ల కృష్ణ సేవను అభినందించిన ప్రిన్సిపాల్‌ బోళ్ల స్రవంతి పఠాన్‌చెరు, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): పఠాన్‌చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలోని బీసీ గురుకుల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాల అవసరాలను గుర్తించిన పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన కొత్తగొల్ల కృష్ణ స్వచ్ఛందంగా ఎల్‌ఈడీ లైట్లను అందజేశారు. ప్రిన్సిపాల్‌ బోళ్ల స్రవంతి ఆధ్వర్యంలో ఈ లైట్లను గురుకులానికి అందించారు. ఈ సందర్భంగా ఆర్సీఓ రాజేశం, ప్రిన్సిపాల్‌ బోళ్ల స్రవంతి, పాఠశాల సిబ్బంది కొత్తగొల్ల కృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సౌకర్యం కోసం...