CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 5:02 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బీసీ గురుకులానికి ఎల్‌ఈడీ లైట్లు అందజేత

  • కొత్తగొల్ల కృష్ణ సేవను అభినందించిన ప్రిన్సిపాల్‌ బోళ్ల స్రవంతి

పఠాన్‌చెరు, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): పఠాన్‌చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలోని బీసీ గురుకుల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాల అవసరాలను గుర్తించిన పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన కొత్తగొల్ల కృష్ణ స్వచ్ఛందంగా ఎల్‌ఈడీ లైట్లను అందజేశారు. ప్రిన్సిపాల్‌ బోళ్ల స్రవంతి ఆధ్వర్యంలో ఈ లైట్లను గురుకులానికి అందించారు.

ఈ సందర్భంగా ఆర్సీఓ రాజేశం, ప్రిన్సిపాల్‌ బోళ్ల స్రవంతి, పాఠశాల సిబ్బంది కొత్తగొల్ల కృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సౌకర్యం కోసం స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఏటీపీ అనిల్‌కుమార్‌, డిప్యూటీ వార్డెన్‌ రాజస్వామి, ఉపాధ్యాయులు ఏసురత్నం, దేవులపల్లి రమేశ్‌, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.