అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర పన్నారు: సీఎం
ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ.. అక్కడే పథకం: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రకు ప్రణాళిక రూపొందించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం శాసనసభలో పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై చర్చించేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 22ఏ భూములు సహా అన్ని కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉందని, వాటిపై చర్చ జరిగితే బీఆర్ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతోనే సభను అడ్డుకునే ప్రయత్నం...