- ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన సేవలు చిరస్మరణీయం: సుమలత
ములుగు, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం ఆదర్శప్రాయమని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ కాళోజీ తన కలం ద్వారా ప్రజా సమస్యలు, సామాజిక అసమానతలు, అన్యాయాలను ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ‘నా గొడవ’ వంటి రచనల ద్వారా సామాన్యుల గొంతుకగా నిలిచారని పేర్కొన్నారు.
కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని సుమలత అన్నారు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, ప్రజాస్వామ్యం, మానవత్వం, సామాజిక న్యాయం కోసం కాళోజీ చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.