బాలికల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి – కెఎల్‌ఆర్‌కు పేరెంట్ కమిటీ సభ్యుల వినతి
తుక్కుగూడ, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, వసతి గృహంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పేరెంట్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. తుక్కుగూడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమస్యలను వివరించారు. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు సరిపడా మౌలిక వసతులు లేవని సభ్యులు తెలిపారు. వసతి గృహ భవనం అనుకూలంగా లేదని, సురక్షితమైన విశాలమైన భవనానికి...