ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నవరాత్రులు నిర్వహించాలి

నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా కరీంనగర్‌, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. సెప్టెంబర్‌ 23న జరిగే ప్రధాన నిమజ్జన కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలమ్‌తో కలిసి పీస్‌ కమిటీ సమావేశంలో ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి గణేష్‌ మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో...