రేపు తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

మాడ్గుల్‌, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మాడ్గుల్‌ మండలంలో గురువారం నిర్వహించనున్నట్లు తహసీల్దార్‌ వినయ్‌ సాగర్‌ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రేషన్‌ డీలర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది,ప్రజలు హాజరుకావాలని కోరారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ప్రాధాన్యత, వినియోగం, వాటి ద్వారా అందే సేవలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది...