చలో హైదరాబాద్ సన్నాహక సమావేశం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలి ఆమనగల్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఆమనగల్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో చలో హైదరాబాద్ కార్యక్రమం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వివిధ శాఖల ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని చలో హైదరాబాద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్,...