- ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలి
ఆమనగల్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఆమనగల్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో చలో హైదరాబాద్ కార్యక్రమం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వివిధ శాఖల ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని చలో హైదరాబాద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ తమ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలిరావాలని కోరారు.
ఈ సందర్భంగా టీజీవో, టీఎన్జీవో తాలూకా అధ్యక్షుడు కొండారపు శేఖర్, వేణు, తిరుపతిరెడ్డి, డాక్టర్ విజయ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు మల్లేశ్వర్, ప్రధాన కార్యదర్శి వి.చందర్, యూటీఎఫ్ నాయకుడు శ్రీనివాసులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, ఆమనగల్ మండల విద్యాధికారి పాండు పాల్గొన్నారు.