కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్ సమరభేరి
అంబేద్కర్ సాక్షిగా వినతిపత్రం సమర్పణ కరీంనగర్ టౌన్(చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వానికి ప్రత్యేకంగా రూపొందించిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని అంబేద్కర్‌ను సాక్షిగా కోరారు....