సమగ్ర పురుగు యాజమాన్యంపై రైతులకు అవగాహన
పత్తిలో పురుగుల నియంత్రణకు సమగ్ర పద్ధతులు పాటించాలి మర్రిగూడ, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): మర్రిగూడ మండలం కొట్టాల గ్రామపంచాయతీ పరిధిలో మండల వ్యవసాయ అధికారి మర్రు సాహస్ ఆధ్వర్యంలో పత్తి పంటలో సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల పర్యవేక్షణ, పురుగుల గుర్తింపు, పురుగు ఉధృతి అంచనా, జీవ, యాంత్రిక నియంత్రణ పద్ధతులను రైతులకు వివరించారు. పురుగుల నియంత్రణలో ముందుగా సమగ్ర పద్ధతులను పాటించి, అవసరమైనప్పుడు మాత్రమే రసాయన మందులను వినియోగించాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల...