CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:54 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సమగ్ర పురుగు యాజమాన్యంపై రైతులకు అవగాహన

  • పత్తిలో పురుగుల నియంత్రణకు సమగ్ర పద్ధతులు పాటించాలి

మర్రిగూడ, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): మర్రిగూడ మండలం కొట్టాల గ్రామపంచాయతీ పరిధిలో మండల వ్యవసాయ అధికారి మర్రు సాహస్‌ ఆధ్వర్యంలో పత్తి పంటలో సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పంటల పర్యవేక్షణ, పురుగుల గుర్తింపు, పురుగు ఉధృతి అంచనా, జీవ, యాంత్రిక నియంత్రణ పద్ధతులను రైతులకు వివరించారు. పురుగుల నియంత్రణలో ముందుగా సమగ్ర పద్ధతులను పాటించి, అవసరమైనప్పుడు మాత్రమే రసాయన మందులను వినియోగించాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం పంటలపై ఎలా ఉంటుందో, నష్టాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కల్లెట్ల లింగయ్య, బుర్ర శేఖర్‌, పెద్ద మారయ్య, కృష్ణయ్య, వెంకటయ్య, శంకర్‌, లక్ష్మమ్మ, శైలజ, ఏఈఓ అరుణ, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.