లేబర్ కోడ్‌ల రద్దుకు ఉద్యమాలకు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభ పిలుపు
కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో అమరజీవి మాదన నారాయణ స్మారక ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహించిన ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాలు, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లపై మహాసభల్లో విస్తృతంగా చర్చించారు. 33 జిల్లాల నుంచి 650 మంది ప్రతినిధులు, 50 మంది ఆహ్వానితులు హాజరుకాగా, 92 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. గత మూడేళ్లలో ఏఐటీయూసీ, అనుబంధ సంఘాలు నిర్వహించిన పోరాటాలు,...