పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుంచి పెట్రోలింగ్ వాహనం అపహరణ
నిందితుడి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పార్క్ చేసిన ప్రభుత్వ పెట్రోలింగ్ ఇన్నోవా క్రిస్టా వాహనం అపహరణకు గురైన ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 7న రాత్రి విధులు ముగిసిన అనంతరం సుమారు 11.45 గంటలకు TS-09-PA-3794 నంబరు గల పెట్రోలింగ్ వాహనాన్ని స్టేషన్ ప్రాంగణంలో నిలిపారు. అనంతరం వాహనం కనిపించకపోవడంతో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా మొహమ్మద్ అజాజ్...