CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 11:05 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జిన్నింగ్ మిల్స్ కార్యదర్శిగా ఎన్నికైన సత్యనారాయణకు ఘన సన్మానం

కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం):

కరీంనగర్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికైన బిక్కుమళ్ల సత్యనారాయణను వైశ్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కరీంనగర్ వైశ్య భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చీదుర సురేష్ ఆధ్వర్యంలో సత్యనారాయణను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వైశ్య సేవా కేంద్రం ప్రతినిధులు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కార్యదర్శిగా సత్యనారాయణ ఎన్నిక కావడం అభినందనీయమని, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్ది విద్యాసాగర్, కోశాధికారి ముస్త్యాల రమేష్, డైరెక్టర్లు కొండ రాంబాబు, పోకల లక్ష్మీనారాయణ, రామిడీ శ్రీధర్, కైలాస నవీన్ తదితరులు పాల్గొన్నారు.