ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి భూమిపూజ
కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్య గళం): హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్న కృష్ణ తెలిపారు కరీంనగర్‌లోని తారక హోటల్‌లో కన్న కృష్ణ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 8 గంటలకు భూమిపూజతో పాటు శ్రీనివాస కల్యాణం, ఉదయం 10:30 గంటలకు ఆర్యవైశ్య ఆత్మీయ...