CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 3:02 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి భూమిపూజ

కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్య గళం): హైదరాబాద్‌ ఉప్పల్ భగాయత్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్న కృష్ణ తెలిపారు కరీంనగర్‌లోని తారక హోటల్‌లో కన్న కృష్ణ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 8 గంటలకు భూమిపూజతో పాటు శ్రీనివాస కల్యాణం, ఉదయం 10:30 గంటలకు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఆర్యవైశ్య ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఆర్యవైశ్య సోదర, సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.సన్నాహక సమావేశంలో కరీంనగర్ పట్టణ సంఘం అధ్యక్షులు, యువజన సంఘాల అధ్యక్షులు, అభ్యుదయ సంఘాల అధ్యక్షులు, వైశ్య ప్రముఖులు, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.