CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 3:00 pm Posted by : rakeshkashaveni12@gmail.com

తిరుమలలో భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల, సెప్టెంబర్‌ 8(చైతన్యగళం):

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోగా, క్యూలైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 6 గంటల సమయం పడుతోంది మంగళవారం ఉచిత దర్శన టోకెన్ల కోటా తెల్లవారుజామున 4.05 గంటలకే పూర్తయింది. సోమవారం 79,445 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.4.80 కోట్ల ఆదాయం సమకూరింది. 36,834 మంది తలనీలాలు సమర్పించగా, 3.95 లక్షల లడ్డూలు విక్రయించినట్లు అధికారులు తెలిపారు.