ధర్మపురి ఆలయాభివృద్ధికి రూ.200 కోట్లతో పనులకు శ్రీకారం

ధర్మపురి, సెప్టెంబర్ 7 (చైతన్య గళం): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం వేకువజామున 2.58 గంటలకు వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేశారు అనంతరం ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఆలయంలోని శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి, శ్రీ...