భర్త మృతి.. మూడు రోజులకే ఇంటి నుంచి గెంటివేత

అత్త, మరిదిపై బాధితుల ఆరోపణ.. బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 6 (చైతన్యగళం): భర్త మృతి చెందిన మూడు రోజులు గడవకముందే తనను, తన కుమార్తెను ఇంటి నుంచి బయటకు పంపించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటన కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం ఐడీపీఎల్‌ గుడిమెట్‌ కాలనీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. గుడిమెట్‌ ఐడీపీఎల్‌ కాలనీలో నివాసం ఉంటున్న స్టాండ్లీ జోఆన ప్రసిక భర్త ఇటీవల మృతి చెందాడు. భర్త మృతి చెందిన మూడు రోజులకే తన అత్త కమలమ్మ, మరిది స్టాండ్లీ...