CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 11:02 pm Posted by : rakeshkashaveni12@gmail.com

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 7 (చైతన్యగళం):

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజగోపాల్‌రావు అధ్యక్షతన జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణ సిబ్బందితో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, లక్ష్యాల సాధన, క్షేత్రస్థాయి అమలు, పర్యవేక్షణపై సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని, నివేదికలు, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డాక్టర్‌ ఉమాశ్రీ, డాక్టర్‌ సనా జవేరియా, డాక్టర్‌ విప్లోశ్రీ, డాక్టర్‌ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.