జగిత్యాల యువత వలసలు ఆపాలి
జగిత్యాల, సెప్టెంబర్ 7 (చైతన్యగళం): జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నరేష్ పటేల్ డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని వైష్ణవి కళాశాలలో డివైఎఫ్ఐ జిల్లా 4వ మహాసభ జిల్లా నాయకులు విజయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ పటేల్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు కొత్త పరిశ్రమలు ఏర్పాటు...