ఆరెపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 7 (చైతన్యగళం): నగరంలోని ఒకటో డివిజన్‌ ఆరెపల్లిలో మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఆరెపల్లిలో నూతన సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలు,...