ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు ఫోరం ఏర్పాటు
పెద్దపల్లి, సెప్టెంబర్ 7 (చైతన్యగళం): ఎస్సీ, ఎస్టీల గౌరవం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మల్లికార్జున ఖర్గేకు సంబంధించిన ఘటన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఎంపీల సమావేశం సోమవారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగింది. సమావేశానికి ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ పార్లమెంట్ సభ్యుల ఫోరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హల్ద్వానీలో ఖర్గే పర్యటన అనంతరం చోటుచేసుకున్నట్లు పేర్కొంటున్న శుద్ధీకరణ ఘటనపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు....