చలో అసెంబ్లీ నేపథ్యంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టు
మర్రిగూడలో బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మర్రిగూడ, సెప్టెంబర్ 7 (చైతన్యగళం): అసెంబ్లీ ముట్టడి (చలో అసెంబ్లీ) కార్యక్రమానికి బీజేపీ పిలుపునివ్వడంతో పాటు విద్యారంగ సమస్యలపై నిరసనలకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా మర్రిగూడలో బీజేపీ నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నారోజు కుమారస్వామితో పాటు మండల నాయకుడు పంగా యాదవయ్య, బూత్ అధ్యక్షులు పంగా...