కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం తప్పదు
కరీంనగర్, సెప్టెంబర్ 7 (చైతన్యగళం): కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాటాలు చేయాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక నియమావళిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఏఐటీయూసీ తెలంగాణ నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ సర్కస్ గ్రౌండ్ వరకు సాగింది సభలో అమర్‌జిత్ కౌర్ మాట్లాడుతూ ఎనిమిది గంటల పని విధానం, కార్మిక...