420 హామీలపై ఎంపీడీవో సులోచనకు వినతిపత్రం సమర్పించిన బీఆర్‌ఎస్ శ్రేణులు
వెల్దండ, సెప్టెంబర్ 7 (చైతన్యగళం): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం వెల్దండ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కల్వకుర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజితారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలు ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రజావాణిలో ఎంపీడీవో సులోచనకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విజితారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన...