చింతకింది శ్రీనివాస్‌కు మణిరత్న అవార్డు

హుస్నాబాద్, సెప్టెంబర్ 6 (చైతన్య గళం): హనుమకొండలోని ఎస్‌వీఎస్ ఆడిటోరియంలో నిర్వహించిన 2026 కొండా లక్ష్మణ్ బాపూజీ మణిరత్న అవార్డును హుస్నాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతకింది శ్రీనివాస్ అందుకున్నారు. ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు స్వరాజ్ న్యూస్, నేతన్న టీవీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ చైర్మన్ గూడూరు...