సెప్టెంబర్ 6 సంకల్ప సభను విజయవంతం చేయాలి
కరీంనగర్‌లో పోస్టర్ ఆవిష్కరణ కరీంనగర్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) పిలుపు మేరకు సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న పీఆర్సీ సాధన సంకల్ప సభను విజయవంతం చేయాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కరివేద మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...