CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:38 am Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండం, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ శుక్రవారం 7వ డివిజన్ పరిధిలో నిర్వహించిన శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ రమాదే శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.