CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 9:47 pm Posted by : rakeshkashaveni12@gmail.com

కోతుల బెడద నివారణకు చర్యలు

కరీంనగర్, సెప్టెంబర్ 5(చైతన్యగళం): నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చేపల కాలనీ 8వ డివిజన్‌ పరిధిలో అనుమతిపొందిన ఏజెన్సీ సిబ్బంది 97 కోతులను పట్టుకున్నారు. అనంతరం వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతాలకు తరలించి విడుదల చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కోతుల బెడదను నియంత్రించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ పశువైద్యాధికారి డా. వై. దుర్గాప్రసాద్‌ రెడ్డి పాల్గొన్నారు.