లోక్ కళ్యాణ్ శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి
కరీంనగర్, సెప్టెంబర్ 5(చైతన్యగళం): లోక్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా వీధి విక్రయదారుల కోసం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మెప్మా అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులు, సీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల యూనిఫాంల తయారీ, వీధి విక్రయదారుల శిబిరాలు, సామాజిక భద్రత పథకాలు, పెండింగ్ చీరల పంపిణీపై సమీక్షించారు. అర్హులైన వీధి విక్రయదారులను గుర్తించి రుణాలు అందించాలని, రెండో...