- పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
కరీంనగర్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): భగత్‌నగర్‌లోని చైతన్య యూత్ ఆధ్వర్యంలో రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేయనున్న శ్రీ విఘ్నేశ్వర మండప ప్రారంభానికి సంబంధించిన కర్ర పూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్ర పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
కార్యక్రమంలో చైతన్య యూత్ క్లబ్ సభ్యులు డోలీ ఉపేందర్, తోట శ్రీకాంత్, సుద్దాల రామగౌడ్, బీమరి సత్యం, గంప మొండయ్య, కడార్ల విమల్, రోహిత్, సాయి, బన్నీ, అరవింద్‌తో పాటు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.