CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 9:46 pm Posted by : rakeshkashaveni12@gmail.com

పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి

హుస్నాబాద్ సెప్టెంబర్ 5(చైతన్యగళం):

హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఏసీపీ సౌడారపు సదానందం అధికారులను ఆదేశించారు. ఏసీపీ కార్యాలయంలో సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు తీవ్రమైన నేరాల కేసుల్లో ఆధారాలను సేకరించి, నిర్ణీత గడువులోగా న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలని సూచించారు. రాజీపడదగిన కేసులను గుర్తించి జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించాలని తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులపై నేరాల విచారణను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను పట్టుకోవాలని, రాత్రివేళల్లో గస్తీని పెంచాలని ఆదేశించారు. న్యాయస్థానాలు జారీ చేసిన అరెస్టు వారెంట్లను పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సమావేశంలో సీఐ శ్రీధర్, ఎస్సైలు లక్ష్మారెడ్డి, అభిలాష్, ప్రశాంత్, అసిఫ్ పాల్గొన్నారు.