రవిదాస్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 5 (చైతన్యగళం): సమాజంలో కుల వివక్షకు తావులేని సమసమాజ స్థాపన, సామాజిక సమరసత కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప ఆధ్యాత్మిక సంస్కర్త సంత్‌ శిరోమణి గురు రవిదాస్‌ మహారాజ్‌ అని బీజేపీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కొనియాడారు. రవిదాస్‌ మహారాజ్‌ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ జాతీయ, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కరీంనగర్‌లోని శుభ...