విద్యా పరిపాలనలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు విశిష్ట ప్రతిభా పురస్కారం

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల నమోదు మంచిర్యాల, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026కు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 5న కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల...