తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద తారురోడ్డు పూర్తి
రూ.28 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మాణం - నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేట్, ఆర్వోబీ ప్రాంతంలో రహదారి సౌకర్యం లేక ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సూచన మేరకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ చొరవతో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.28 లక్షలు కేటాయించి తారురోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. కరీంనగర్–చొప్పదండి ప్రధాన...