1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మహిళల ఆగ్రహం
దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లిలో మహిళా సదస్సు.. నిరసన, వంటావార్పు పెద్దపల్లి, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన...