కేబుళ్ల క్రమబద్ధీకరణకు విద్యుత్‌శాఖ కొరడా!

విద్యుత్‌ స్తంభాలపై జిగ్‌జాగ్‌ కేబుళ్లకు చెక్‌ పోల్‌ యుటిలైజేషన్‌ లెక్కింపు.. జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌కు షెడ్యూల్‌ కరీంనగర్, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): విద్యుత్‌ స్తంభాలను వినియోగిస్తున్న కేబుల్‌ టీవీ, ఫైబర్‌ నెట్‌వర్క్‌, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు విద్యుత్‌ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. కరీంనగర్‌ టౌన్‌ డివిజన్‌ పరిధిలో ఏడీఈ, ఏఈల పర్యవేక్షణలో కేబుల్‌ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి, విద్యుత్‌ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుళ్లను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. రోడ్డు క్రాసింగ్‌ల వద్ద జిగ్‌జాగ్‌గా వేలాడుతున్న కేబుళ్లను తొలగించి...