ఉపాధ్యాయ వృత్తి అన్నింటికంటే గొప్పది

దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకం: ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్‌జీ రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): సమాజంలో మార్పు తీసుకురావడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రపంచంలోని అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి ప్రధానమైనదని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్‌జీ అన్నారు. తపస్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 90 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కాచం రమేష్‌జీ మాట్లాడుతూ భారతదేశం త్వరలో విశ్వగురువుగా...