సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
లోయర్ మానేరు డ్యామ్ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ క్లోరినేషన్, ఫిల్టర్ బెడ్, మోటార్ల పనితీరుపై క్షేత్రస్థాయి తనిఖీ కరీంనగర్, సెప్టెంబర్ 4(చైతన్యగళం): నగర ప్రజలకు నిరంతరాయంగా పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. లోయర్ మానేరు డ్యామ్ సమీపంలోని నగరపాలక సంస్థ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని గురువారం ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఫిల్టర్ బెడ్ ఆవరణలోని పరిసరాలను పరిశీలించిన కమిషనర్.. ఫిల్టర్ బెడ్...