బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా

ప్లాస్టిక్‌పై ప్రత్యేక డ్రైవ్‌.. గణేష్‌ ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకే లక్ష్యం: మేయర్‌ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4(చైతన్యగళం): నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి, రెండు స్థానాల్లో నిలిపేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై జరిమానాలు విధించాలని, ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం...