CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 12:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వెయ్యి రోజుల ప్రజా పాలనపై కాంగ్రెస్‌ సంబరాలు

హుజురాబాద్‌, సెప్టెంబర్‌ 4 (చైతన్యగళం): కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజా పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌బాబు ఆదేశాల మేరకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రొంటాల సుహాసిని మనోజ్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ చేపట్టారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ ప్రజా పాలనను కొనియాడారు. అనంతరం పటాకులు కాల్చి, కేక్‌ కట్‌ చేసి వెయ్యి రోజుల ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో టౌన్‌ ప్రెసిడెంట్‌, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.